చిత్తములో, వేలకొలది
ఉత్తమయోచనలు కూడ రూపింపనిచో
ఉత్తవెయగు, రాతినిఁబడు
విత్తునమునఁ బ్రాణమెట్లు వెల్వడు శాస్త్రీ!
కొన్ని పదాలకు అర్థాలు:
--
రూపించు = నిరూపించు, చేసి చూపు
వెల్వడు = వెలువడు, బయటకు వచ్చు
భావము: మనసులో వేలకువేలుగా ఆలోచనలు ఉన్నా, వాటిని మనం ఆచరణలో పెట్టి ఋజువుచెయ్యకపోతే, అవి పనికిరావు. రాతిపైన పడిన విత్తనం మొలకెత్తుతుందా? (రాతిని ఊహలతోనూ, ఆలోచనలను విత్తనముతోనూ, మట్టిని వాస్తవంతోనూ పోల్చడం జరిగింది).
Tuesday, July 6, 2010
Sunday, June 27, 2010
పరమాత్మ ఒక్కటే
పరమగు శక్తినిఁ గాంచక
హరిహరులకు భేదమెంచి యధికుడెవడనన్
యిరువురునొకటేనన్నది
యెరుగని నీలోని మాయె హెచ్చుర శాస్త్రీ
భావం: పరమాత్ముణ్ణి దర్శించలేక శివుడు గొప్పా? విష్ణువు గొప్పా? అని ప్రశ్నిస్తున్నావు అంటే ఆ రెండు రూపాలలో ఉన్న పరమైనశక్తి ఒకటేనన్న విషయాన్ని గ్రహించలేని నీలోని మాయ బలమైనది అని సంకేతం.
వివరణ: శివుడు గొప్పా? కేశవుడు గొప్పా అన్న విషయానికి అనేకమంది అనేక సమాధానాలు ఇచ్చారు. పురాణాలను రచించిన వ్యాసభగవానుడు కూడా ఒక్కో పురాణంలో ఒక్కోలాగా చెప్పాడు. కొందరి చర్చించుకున్నారు, కొందరు వాదించుకున్నారు, కొందరు ద్వేషించుకున్నారు, కొందరి కొట్టుకున్నారు. కానీ ఒక్క విషయం గమనించాలి. ప్రపంచాన్నంతటినీ సృష్టించినది ఒక శక్తే ఐతే ఆ శక్తికి ఒక భాషేమిటి? ఒక రూపమేమిటి? ఒక లింగభేదమేమిటి? ఒక గుణమేమిటి? పరమాత్మ ఒక్కటే! మన చూసే దృష్టిని బట్టి ఒక్కో ఆకారంలో కనిపిస్తాడు. మన ఉపనిషత్తులలో కూడా "తత్ త్వం అసి" అని అన్నారు కదా?
మన వైదీక సంస్కృతిలో ఒక గొప్పదనం ఉంది. ఒకరే దేవుడు అని మనం అనము. అమ్మ, నాన్న, గురువు, పెద్దలు, పిల్లలు అందరినీ దేవుళ్ళంటాము. గోవు, పాము, ఎద్దు, ఏనుగు ఇలా జీవరాశినంతా పరమాత్మ ప్రతిరూపాలుగా పూజిస్తాము. కాకి, కుక్క, కోతి అని భేదం చూపించకుండా వాటిని పోషిస్తాము. చెట్టుని, అడవిని, కొండని, రాయిని, పుట్టనీ కూడా పూజిస్తాము. అన్నింటిలోనూ ఆ పరమాత్మను చూడాలి అన్న మన సంస్కృతి పరమార్థాన్ని గ్రహించకుండా ఎవరు గొప్ప అని కొట్టుకోవడం అవివేకం కదా?
మళ్ళీ చాలా కాలానికి ఈ శతకంలో పద్యాలు వ్రాస్తున్నాను. కొన్నాళ్ళు విరామం తీసుకుందాము అనుకున్నవాడిని క్రమేపి బద్ధకించాను. నన్ను వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహించిన చదువర్లకు నా నమస్కారాలు. మీకు నేను ఋణపడి ఉన్నాను. ఇకపై తప్పకుండా తరచూ పద్యాలను వ్రాస్తాను.
హరిహరులకు భేదమెంచి యధికుడెవడనన్
యిరువురునొకటేనన్నది
యెరుగని నీలోని మాయె హెచ్చుర శాస్త్రీ
భావం: పరమాత్ముణ్ణి దర్శించలేక శివుడు గొప్పా? విష్ణువు గొప్పా? అని ప్రశ్నిస్తున్నావు అంటే ఆ రెండు రూపాలలో ఉన్న పరమైనశక్తి ఒకటేనన్న విషయాన్ని గ్రహించలేని నీలోని మాయ బలమైనది అని సంకేతం.
వివరణ: శివుడు గొప్పా? కేశవుడు గొప్పా అన్న విషయానికి అనేకమంది అనేక సమాధానాలు ఇచ్చారు. పురాణాలను రచించిన వ్యాసభగవానుడు కూడా ఒక్కో పురాణంలో ఒక్కోలాగా చెప్పాడు. కొందరి చర్చించుకున్నారు, కొందరు వాదించుకున్నారు, కొందరు ద్వేషించుకున్నారు, కొందరి కొట్టుకున్నారు. కానీ ఒక్క విషయం గమనించాలి. ప్రపంచాన్నంతటినీ సృష్టించినది ఒక శక్తే ఐతే ఆ శక్తికి ఒక భాషేమిటి? ఒక రూపమేమిటి? ఒక లింగభేదమేమిటి? ఒక గుణమేమిటి? పరమాత్మ ఒక్కటే! మన చూసే దృష్టిని బట్టి ఒక్కో ఆకారంలో కనిపిస్తాడు. మన ఉపనిషత్తులలో కూడా "తత్ త్వం అసి" అని అన్నారు కదా?
మన వైదీక సంస్కృతిలో ఒక గొప్పదనం ఉంది. ఒకరే దేవుడు అని మనం అనము. అమ్మ, నాన్న, గురువు, పెద్దలు, పిల్లలు అందరినీ దేవుళ్ళంటాము. గోవు, పాము, ఎద్దు, ఏనుగు ఇలా జీవరాశినంతా పరమాత్మ ప్రతిరూపాలుగా పూజిస్తాము. కాకి, కుక్క, కోతి అని భేదం చూపించకుండా వాటిని పోషిస్తాము. చెట్టుని, అడవిని, కొండని, రాయిని, పుట్టనీ కూడా పూజిస్తాము. అన్నింటిలోనూ ఆ పరమాత్మను చూడాలి అన్న మన సంస్కృతి పరమార్థాన్ని గ్రహించకుండా ఎవరు గొప్ప అని కొట్టుకోవడం అవివేకం కదా?
Monday, May 25, 2009
భవబంధాలు
నాగము తన కూసము విడి
సాగెడి కరణిన్ మనుజులు సంగాతులపై
రాగమనెడి హృదయాంతర
భోగము విడి మనుట మేలు భువిలో శాస్త్రీ
సాగెడి కరణిన్ మనుజులు సంగాతులపై
రాగమనెడి హృదయాంతర
భోగము విడి మనుట మేలు భువిలో శాస్త్రీ
పాము తన శరీరరక్షణ కొరకై కుబుసాన్ని ఏర్పరుచుకుంటుంది. కానీ కొన్ని రోజులకు దానిని విదిచిబెట్టి వెళ్ళిపోతుంది. అలాగే మనిషి కూడా తన మనసు వికసించడానికి అనేక బంధాలు ఏర్పరుచుకుంటాడు. ఐతే ఈ బంధాలు కూడా కుబుసం లాగా కడ దాక వచ్చేవి కావు. మధ్యలో వెళ్ళిపోయేవే. ఈ విషయం తెలుసుకున్నవాడు వీటికి దూరంగా ఉండటం మంచిది.
అంటే అర్థం: "అమ్మ ఎవరు, నాన్న ఎవరు? - అన్నీ ఆ పరమాత్ముడే!", అని చెప్పేసి సన్యాసులలోనో, బ్రహ్మచరులలోనూ కలిసిపోమ్మని కాదు. అమ్మ, నాన్న, అన్నా, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, బిడ్డ ఇలాంటి బంధాలు అన్నీ అనుభవిస్తున్నట్టు ఉంటూనే, ఇవి తాత్కాలికం అని తెలుసుకుని తామరాకు పైన నీటి బొట్టుకు మల్లె ఉండటం మంచిది అని.
చాలా రోజులయ్యింది నేను ఈ శతకం కోసం పద్యం వ్రాసి. దైవికంగా ఏవో దైనికి చింతల మధ్యలో పడి, అందరు మనుషుల్లాగే నేనూ మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడంలో విఫలుణ్ణయ్యాను. అందుకే మళ్ళీ మనసు ప్రశాంతతని పొందేదాకా ఆగి వ్రాస్తున్నాను. ఈ దారిలో నన్ను నడిపిస్తున్న ఆ కృష్ణ పరమాత్ముడికి, ఆది శంకరాచార్యునికి నా సాష్టంగప్రణామాలు.
Monday, March 16, 2009
శ్రీహరి నామస్మరణ
దేహీయన నేర్చిన యీ
దేహికి పట్టును తిమిరము దెయ్యము రీతిన్
మోహము బోవగ మార్గము
శ్రీహరిచరణారవింద చింతయె శాస్త్రీ
కోరుకోవడం అనే అలవాటు కలిగిన ఆత్మ అంధకారంలో (మాయాప్రపంచం) పడుతుంది. ఆ కోరికలు ఎప్పటికీ తీరేవి కావు. ఒకవేళ తీరితే మరిన్ని కోరికలకు దారి తీసేవి మాత్రమే. ఆ మాయలోనుండి బయట పడేందుకు మార్గం భగవద్-ధ్యానమే. భక్తియోగాన్న్ని అవలంబిస్తే ఏనాటికైనా ఆ పరమాత్ముడిని చేరుతాము.

Sunday, July 6, 2008
కాదనలేక కల్యాణం...కలకాలం కాంతాళం...
చెల్లని నుడి పొగడదగును
మొల్లము త్యజియించదగును మొగమోటమితో
ఉల్లమునొప్పక నెరవుగ
ఒల్లకుమీ పెళ్లి మాట ముప్పుర శాస్త్రీ
కొన్ని పదాలకు అర్థాలు:
--
నుడి = మాట, ప్రమాణం
మొల్లము = ధనము
త్యజియించు = విడిచిపెట్టు
మొగమోటమి = (వాడుక లో) మొహమాటం
ఉల్లము = మనసు
నెరవుగ = పూర్తిగా
ఒల్లు = ఎంచుకొను, ఒప్పుకొను
భావము:
--
మొహమాటంతో పచ్చి అబద్ధాన్ని (నిజమని) పొగడవచ్చు, డబ్బుని విడిచిపెట్టవచ్చు. అంతే కానీ, (మొహమాటంతో) మనసుకు నచ్చకుండా మనువాడరాదు. అది ముప్పుకు దారి తీస్తుంది.
ఎవరైనా "నిన్ను పెళ్ళి చేసుకుంటాను" అంటే - మొహమాటానికో, వారి మెప్పు పొందటానికో, వేరొక కారణం చేతనో పెళ్ళి చేసుకోకూడదు. నిజంగా మనసుకు నచ్చితేనే చేసుకోవాలి. అలాగని, "నాకెవరూ నచ్చలేదు అని కూర్చోవచ్చా?", అంటే అది మీ ఇష్టాయిష్టాలను బట్టి ఉంటుంది. ఎవ్వరూ నచ్చకపోతే మనమే ఎక్కువగా ఆశిస్తున్నామేమో!

Wednesday, December 26, 2007
ఏ బంధానికైనా నమ్మకం ముఖ్యం
ఏకతమాడుచు తెల్పుము
ఆకూతంబులనగూఢభావముదోడన్
ఏకీభావంబువినా
చీకటిలో వెదకులాట చెలిమియె శాస్త్రీ
కొన్ని పదాలకు అర్థాలు:
--
ఏకతమాడు = ఏకాంతంలో మాట్లాడు (తగిన సందర్భంలో)
ఆకూతము = అభిప్రాయము, కోరిక
అగూఢభావము = దాపరికము లేకుండా
ఏకీభావము = ఐక్యత, ఏకాభిప్రాయము
వినా = లేకుండా
భావము:
--
ఏదైనా బంధానికి ఇరువర్గాలూ వారి అభిప్రాయాలను తేటపరచాలి. లేనిచో ఆ బంధం - ముసుకులో గుద్దులాటలాగా ఉంటుంది. నిజమైన చెలిమి సంతృప్తినీ, సంతోషాన్నీ కలిగిస్తే, ఇలాంటి (పరస్పరం అవగాహన లేని) చెలిమివలన బాధ, అశాంతి కలుగుతూ ఉంటాయి.
అలాగని, అభిప్రాయాల్ని ఎక్కడబడితే అక్కడ తెలుపరాదు. సరియైన సందర్భం, చోటూ చూసుకుని చర్చించుకోవాలి.

Thursday, December 20, 2007
అంగములను అధిగమించుట అవఘళము
దబ్బర తెలియని వెకలియు
బిబ్బోకములెరుగలేని పేడియు పుణ్యుల్
ప్రెబ్బొత్తిగ వీరు నయము
కిబ్బిషములు జేయలేరు కెలవున శాస్త్రీ
కొన్ని పదములక అర్థములు:
--
దబ్బర = మోసము, అబద్ధము
వెకలి = పిచ్చివాడు, వెర్రివాడు
బిబోకము = శృంగార చేష్ట
ఎరగు = గ్రహించు
పేడి = నపుంసకుడు (ఆడ, మగ కాని మనిషి)
పుణ్యుడు = పవిత్రమైనవాడు
ప్రెబ్బొత్తిగ = నిశ్చయముగ
నయము = ఉన్నతము
కిబ్బిషము = పాపము
కెలవు = సంభోగేచ్ఛ
భావము:
--
పిచ్చివాళ్ళు, నపుంసకులు కామోద్రేకంతో, స్వార్థంతో తప్పిదములు, అధర్మములు చేసేవారి కంటే అదృష్టవంతులు. వారికి తప్పు చేసే అవకాశం ఉందని గాని, దాని వలన వారికి కలిగే తాత్కాలికమైన లాభముల గురించిగాని తెలియదు.

Subscribe to:
Posts (Atom)