Monday, May 25, 2009

భవబంధాలు

నాగము తన కూసము విడి
సాగెడి కరణిన్ మనుజులు సంగాతులపై
రాగమనెడి హృదయాంతర
భోగము విడి మనుట మేలు భువిలో శాస్త్రీ

పాము తన శరీరరక్షణ కొరకై కుబుసాన్ని ఏర్పరుచుకుంటుంది. కానీ కొన్ని రోజులకు దానిని విదిచిబెట్టి వెళ్ళిపోతుంది. అలాగే మనిషి కూడా తన మనసు వికసించడానికి అనేక బంధాలు ఏర్పరుచుకుంటాడు. ఐతే ఈ బంధాలు కూడా కుబుసం లాగా కడ దాక వచ్చేవి కావు. మధ్యలో వెళ్ళిపోయేవే. ఈ విషయం తెలుసుకున్నవాడు వీటికి దూరంగా ఉండటం మంచిది.

అంటే అర్థం: "అమ్మ ఎవరు, నాన్న ఎవరు? - అన్నీ ఆ పరమాత్ముడే!", అని చెప్పేసి సన్యాసులలోనో, బ్రహ్మచరులలోనూ కలిసిపోమ్మని కాదు. అమ్మ, నాన్న, అన్నా, అక్క, చెల్లి, తమ్ముడు, భార్య, బిడ్డ ఇలాంటి బంధాలు అన్నీ అనుభవిస్తున్నట్టు ఉంటూనే, ఇవి తాత్కాలికం అని తెలుసుకుని తామరాకు పైన నీటి బొట్టుకు మల్లె ఉండటం మంచిది అని.

చాలా రోజులయ్యింది నేను ఈ శతకం కోసం పద్యం వ్రాసి. దైవికంగా ఏవో దైనికి చింతల మధ్యలో పడి, అందరు మనుషుల్లాగే నేనూ మనసును పరిశుద్ధంగా ఉంచుకోవడంలో విఫలుణ్ణయ్యాను. అందుకే మళ్ళీ మనసు ప్రశాంతతని పొందేదాకా ఆగి వ్రాస్తున్నాను. ఈ దారిలో నన్ను నడిపిస్తున్న ఆ కృష్ణ పరమాత్ముడికి, ఆది శంకరాచార్యునికి నా సాష్టంగప్రణామాలు.

2 comments:

ప్రణీత స్వాతి said...

గ్రేట్ సందీప్ గారూ..చాలా బాగుంది.

కంది శంకరయ్య said...

సందీప్ గారూ,
మీ బ్లాగు చూడడం ఇదే మొదటిసారి. కేవలం చూడడమే. ఇంకా చదవలేదు. చదివాక కామెంటుతా. మనోనేత్రంలో "నన్ను పోలిన మనిషి" చదివాను. వ్యంగ్య రచనలు చేయడంలో మీరు సిద్ధహస్తులు. బాగుంది.