Tuesday, July 6, 2010

చేసిచూపాలి

చిత్తములో, వేలకొలది
ఉత్తమయోచనలు కూడ రూపింపనిచో
ఉత్తవెయగు, రాతినిఁబడు
విత్తునమునఁ బ్రాణమెట్లు  వెల్వడు శాస్త్రీ!

కొన్ని పదాలకు అర్థాలు:
--
రూపించు = నిరూపించు, చేసి చూపు
వెల్వడు = వెలువడు, బయటకు వచ్చు

భావము: మనసులో వేలకువేలుగా ఆలోచనలు ఉన్నా, వాటిని మనం ఆచరణలో పెట్టి ఋజువుచెయ్యకపోతే, అవి పనికిరావు.  రాతిపైన పడిన విత్తనం మొలకెత్తుతుందా? (రాతిని ఊహలతోనూ, ఆలోచనలను విత్తనముతోనూ, మట్టిని వాస్తవంతోనూ పోల్చడం జరిగింది).

7 comments:

రవి said...

మీ శతకానికి ప్రత్యేకమైన అందం మకుటంలో ఉందని అనిపిస్తున్నది. శాస్త్రీ అన్న పదం అటు సరళమైన పదాలకు, ఇటు కఠినమైన పదాలకు రెంటికీ చక్కటి ఊనిక చేకూరుస్తున్నది. అభినందనలు.

Sandeep P said...

@రవి

"శాస్త్రీ" అన్నది మా నాన్నగారు పేరు. త్వరలోనే ఈ పద్యాలను పూర్తి చెయ్యగలనని ఆశిస్తున్నాను. మీ మంచి మాటలకి నా కృతజ్ఞతలండి :)

ప్రణీత స్వాతి said...

వేమన శతకాలంత ఇంటరెస్టింగా ఉన్నాయండీ..శాస్త్రీ శతకాలు.

ప్రణీత స్వాతి said...

మళ్ళీ రాయడం మానేశారాండీ..శాస్త్రి శతకాలు?

Sandeep P said...

@ప్రణీతాస్వాతి

:-( ఏప్రిల్ నెలనుండి మళ్ళీ (నా చిట్టి) అనుభవసారాన్ని త్రవ్వి వ్రాస్తాను. ఈ ఆగష్టు సమయానికి పూర్తిచెయ్యాలని నా ఆకాంక్ష. మీ ప్రోత్సాహం నాకు ఎంతగానో ఉపయోగపడుతోంది :)

లక్ష్మీదేవి / लक्ष्मीदेवी said...

చిట్టి.. ఆ అమ్మాయెవరు? :) :)

Sandeep P said...

@మందాకిని గారు

నన్ను involve చెయ్యకండి మందాకిని గారు. నాకసుంటియ్యేవీ తెలియవు.