Sunday, September 2, 2007

మాటలు చెప్పడం సులువు

కోటలు గట్టొచ్చు, సిరుల
తోటలు పండించవచ్చు, దొనరగ దివిలో
బాటలు వేయొచ్చు, బలిమి
మాటలఁజెప్పుట సులభము మనిషికి శాస్త్రీ

కొన్ని పదాలకు అర్థాలు:
--
దొనరగ = ఒప్పే విధంగ
బలిమి = గొప్ప

భావము:
--
ఆకాశంలో దారులు వేస్తాను, కోటలు కట్టేస్తానని, డబ్బు సంపాదిస్తాననిమొదలైన మాటలు చెప్పుట ఎవరికైనా సులభమే! (అవి సాధించడం కష్టం).

2 comments:

Sriram said...

వందనం. మీ పద్యాలు చాలా బాగున్నాయి. మంచి శైలి, భాషాసంపదా ఉంది మీకు. అభినందనలు.

వాగ్విలాసం బ్లాగులో మీ వ్యాఖ్య చూసి ఇలా వచ్చాను. మీరు చెప్పినట్టు సమస్యని ముక్కలు చేసి పూరించడం అంత అందంగా ఉండకపోవచ్చు. కానీ అలాంటి అసందర్భమైన సమస్యలకి క్రమాలంకారం మాత్రమే నాబోటి వాళ్ళకి పనికొచ్చేది. మహామహులైన వేలూరి శివరామశాస్త్రి గారి లాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి పూరణలు చేసినవాళ్ళే. మీరు కనక ఆ సమస్యని వేరే పద్ధతిలో పూరించగలిగితే చూడాలని ఉంది.

Also, please add your blog to koodali.org so that more people can see it.

~Sriram
sreekaaram.wordpress.com

rākeśvara said...

బాగుంది, మీ బ్లగు, మీ కందాలు.